బొంతపల్లి ఆలయ చరిత్ర

పురాణం ప్రకారం, కొంత కాలం క్రితం బొంతపల్లి లో శ్రీ వీరభద్ర స్వామి చిన్న ఆలయం ఉండేది, ఒక రోజు రాత్రి ఒక కాపరి ఆలయం ముందు నుంచి ప్రయాణిస్తున్నాడు అతనికి ఎవరొ పిలుస్తునట్లు వినిపించి వెనకకు తిరిగాడు, శ్రీ వీరభద్ర స్వామిని చూసి భయపడ్డాడు, స్వామి వారికి ఆలయ ప్రదేశం ఇష్టం లేదని అతనిని వేరొక ప్రదేశానికి మార్చమని కోరాడు. శ్రీ వీరభద్ర స్వామి వారు కాపరి భుజాలపై కూర్చున్నాడు కాపరి నడుస్తూ కోన్ని కిలొమీటర్లు దూరం వెళ్ళిన తరవాత స్వామి వారిని ప్రస్తుత ఆలయ ప్రదేశం లో ప్రతిష్ట చేశాడు, తరవాత స్వామివారు కాపరిని వేనకకు తిరగకుండా ఇంటికి వెళ్ళమని చెప్పాడు, వేనకకు తిరిగితే శిల్పముగా మారిపొతావని చెప్పాడు, కాపరి కొంతదూరం వెళ్ళిన తరవాత వెనుకకు తిరిగి శిల్పముగా మారిపొయాడు, ఆ విగ్రహం గ్రామంలో ఇప్పటికి ఉంది, ఒక రోజు వీరభద్ర స్వామి పూజారికి మరియు గ్రామ పెద్దలకు కలలో కనిపించి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని చెప్పాడు, ఈ కొత్త ప్రదేశంలో ఉన్న ఆలయమే ప్రస్తుత పెద్ద ఆలయం.

ఇంకా..